వాగులో కారు పడి వ్యక్తి మృతి..

వేల్పూర్ మండలంలోని పడిగేల గ్రామానికి చెందిన గాదె రమేష్ (55)అనే రైతు కారు అదుపుతప్పి సూర్నపు వాగులో పడి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకొంది.

Update: 2024-06-24 17:08 GMT

దిశ, భీంగల్ : వేల్పూర్ మండలంలోని పడిగేల గ్రామానికి చెందిన గాదె రమేష్ (55)అనే రైతు కారు అదుపుతప్పి సూర్నపు వాగులో పడి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకొంది. స్థానికుల తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పడిగేల, పోచంపల్లి గ్రామాల మధ్య ఉన్న సూర్నపు వాగు పై చెక్ డ్యామ్ నిర్మించి ఉండగా ఆ వాగులో నీరు భారీ స్థాయిలో నిలిచి ఉన్నాయి. ఈ వాగు పై నుంచి వరద కాలువ పోతుండగా దాని కింద వాగులో నీరు నిలిచి ఉంది. ఇక్కడ రెండు గ్రామాల రైతులు కరెంట్ మోటార్లను బిగించుకొని మోటార్ల ద్వారా తమ తమ పొలాలకు నీటి ఎత్తిపోసుకొంటారు.

ఈ క్రమంలో రమేష్ తన డిజయర్ కారులో పని వారిని తీసుకొని మోటార్ ఫిట్ చేయించడానికి వాగు వద్దకు వచ్చాడు. మోటార్ ఫిట్టింగ్ పని పూర్తి కాగానే ఇంటికి వెళదామని పని వాళ్ళను తీసుకొని కారు వద్దకు వచ్చి కారును మలిపే క్రమంలో రివర్స్ తీస్తుండగా అదుపుతప్పి వాగులో పడింది. వాగులో నీరు ఎక్కవ ఉండడంతో కారు నీటిలో మునిగి మృతి చెందాడు. పనికి వచ్చినవారు కూడా కారు మలిపిన తర్వాత ఎక్కుతామని చెప్పడంతో వారికి గండం తప్పింది. మృతుడు రమేష్ కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు అమెరికాలో ఉన్నారు. సమాచారం అందుకొన్న వేల్పూర్ ఎస్సై వినయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని గజ ఎత్తగాళ్ళతో కారును వెలికి తీయించారు. శవ పంచనామా నిర్వహించిన పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News