పిల్లలను ఎత్తుకెళ్లే వ్యక్తి అనే అనుమానంతో దాడి.. చివరికి..

నిజామాబాద్ నగరంలో పిల్లలను ఎత్తుకెళ్లే వ్యక్తిగా అనుమానించి ఒకరిపై దాడి చేశారు.

Update: 2024-02-12 06:24 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో పిల్లలను ఎత్తుకెళ్లే వ్యక్తిగా అనుమానించి ఒకరిపై దాడి చేశారు. ఈ దాడిలో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం నగరంలోని గాయత్రి నగర్‌లో జరిగింది. నిజామాబాద్ రూరల్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన రాజు (40) పశువుల కాపరిగా పనిచేస్తున్న జీవిస్తున్నాడు. అతనికి అమ్మవారు పూనడంతో( అమ్మవారిని ఆరాధించే) వ్యక్తిగా స్థానికులు చెబుతున్నారు.

అందులో భాగంగానే సదరు వ్యక్తి అమ్మవారి పూజకు ముందుగా చీర జాకెట్లు ధరించే వాడని చెబుతున్నారు. సోమవారం ఉదయం రాజు నగరంలోని గాయత్రి నగర్‌లో వెళ్తుండగా స్థానికులు అతన్ని పిల్లలు ఎత్తుకెళ్లే వ్యక్తిగా అనుమానించి కొట్టారు. మూకుమ్మడిగా కర్రలతో దాడి చేసి కొట్టడంతో అతడు అపస్మారక స్థితికి వెళ్ళాడు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతని స్టేషన్ తరలించి అక్కడి నుంచి జిల్లా జనరల్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఈ మేరకు నాలుగవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


Similar News