జగిత్యాలలో భారీ చోరీ...తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం

జగిత్యాల పట్టణంలోని శివాజీవాడలో దొంగలు రెచ్చిపోయారు.

Update: 2024-10-10 12:34 GMT
జగిత్యాలలో భారీ చోరీ...తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం
  • whatsapp icon

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల పట్టణంలోని శివాజీవాడలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసి బంగారు నగలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. తోట ప్రసాద్ అనే వ్యక్తి దసరా పండుగ నేపథ్యంలో ఇంటికి తాళం వేసి సొంత ఊరైన కరీంనగర్ వెళ్లారు. విషయం గమనించిన దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా పగలగొట్టి సుమారు ౪ తులాల బంగారంతో పాటు 30 వేల నగదు ఎత్తుకెళ్లారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రసాద్ జగిత్యాల చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Tags:    

Similar News