Arrest : లంచం తీసుకుంటూ సిబిఐకి పట్టుబడ్డ ఈడీ అధికారి

లంచం తీసుకున్న ఆరోపణలపై ఓ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ను సిబిఐ అధికారులు ఈ రోజు అరెస్ట్ చేశారు.

Update: 2024-08-08 13:25 GMT

దిశ, వెబ్‌డెస్క్ : లంచం తీసుకున్న ఆరోపణలపై ఓ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ను సిబిఐ అధికారులు ఈ రోజు అరెస్ట్ చేశారు. ముంబై నగరానికి చందిన ఒక నగల వ్యాపారి నుండి సదరు అధికారి రూ. 20 లక్షలు లంచం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ అధికారిని సందీప్ సింగ్ యాదవ్ గా గుర్తించారు. ఢిల్లీలో సిబిఐ అతన్ని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.

కాగా .. "సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్" (CBI) తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ నెల 3,4 తేదీలలో ముంబైలోని నగల వ్యాపారి ఇంట్లో సోదాలు జరిపారు. సోదాల అనంతరం ED అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ సింగ్ యాదవ్ నగల వ్యాపారి కొడుకుకు కాల్ చేసి 25 లక్షలు లంచం ఇవ్వాలని , లేని పక్షంలో అరెస్ట్ చేస్తానని అతన్ని బెదిరించాడు. ఫోన్లో చర్చల ద్వారా లంచం రూ . 20 లక్షలకు తగ్గించాడు. సెంట్రల్ బోర్డు అఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) అధికారి అయిన సందీప్ సింగ్ యాదవ్ ఈ రోజు ఢిల్లీలో లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డట్లు అధికారులు తెలిపారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 


Similar News