రతిక అడిగి మరీ ఆ పని చేయించుకుంది.. పరువు తీసిన పల్లవి ప్రశాంత్
తెలుగు బిగ్‌బాస్ సీజన్- 7లో ఒక కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ సీజన్- 7లో ఒక కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. హౌజ్‌లో అడుగుపెట్టిన మొదట్లో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్న తర్వాత తన ఆట తీరుతో, మంచి మనసుతో కోట్లాది ప్రజల మనసులను గెలుచుకుని విజేతగా నిలిచాడు. ఒక కామన్ మ్యాన్‌కు బిగ్‌బాస్‌లో చాన్స్ రావడమే గొప్ప అనుకుంటే, ఏకంగా టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. ‘‘నాగార్జున నా చెయ్యి పైకి ఎత్తినప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోయాను. అమ్మో నేనే గెలిచానా? అని ఊహించుకోలేకపోయాను. మాటలు రాలేదు. ఈ సక్సెస్ నా ఒక్కడిదే కాదు.. నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరిది అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే నాతో క్లోజ్‌గా ఉంటూనే రతిక నన్ను నామినేట్ చేయడం నాకు నచ్చలేదు. ఇంట్లో జరిగిన విషయాలు కాకుండా బయట పాయింట్స్ తీసుకొచ్చి నన్ను నామినేట్ చేసింది. ఇక ఆమెను దూరం పెట్టడం స్టార్ట్ చేశాను. అక్క అని పిలవమన్నది తనే. అందుకే అక్క అని పిలిచాను. తర్వాత మళ్ళీ అక్క అని పిలవద్దు. ఫ్రెండ్స్‌లా ఉందామన్నది. రతికను అక్క అనవద్దని శివాజీ అన్నతో తను రికమెండ్ కూడా చేయించింది. కానీ ఒక్కసారి అక్క అంటే ఇక అక్కే’’ అని ప్రశాంత్ తెలిపాడు.