బిగ్ బాస్ చీఫ్ గెస్ట్‌గా మెగా హీరో .. వైరల్ అవుతున్న ఫొటో.. ఇక టీఆర్పీలు బద్దలే అంటున్న ఫ్యాన్స్
తెలుగు బిగ్ బాస్ సీజన్-8 ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసింది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు ఆదివారం (డిసెంబర్ 15)తో ఎండ్ కార్డ్ పడనుంది.
దిశ, సినిమా: తెలుగు బిగ్ బాస్ సీజన్-8 ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసింది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు ఆదివారం (డిసెంబర్ 15)తో ఎండ్ కార్డ్ పడనుంది. ఇక ఇందులో మెయిన్ కంటెస్టెంట్లుగా 14 మంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో మరో 8 మంది మొత్తం 22 మంది కంటెస్టెంట్లు ఈ సీజన్‌లో పాల్గొన్నారు. వీరిలో ఐదుగురు ఫైనల్‌కు(నిఖిల్, నబీల్, ప్రేరణ, గౌతమ్, అవినాష్) చేరుకున్నారు. అయితే నిన్న ముక్కు అవినాష్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయాడు. ఇక ప్రస్తుతం ప్రధానంగా ఇద్దరి మధ్యనే పోటీ రసవత్తరంగా ఉంది. గౌతమ్, నిఖిల్.. నువ్వా?నేనా? అంటూ ఓటింగ్‌లో టాప్ లో దూసుకుపోయారు. మరి ఈ సీజన్‌లో ఎవరు విజేతగా నిలవనున్నారనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది.
కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతను ప్రకటించేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ పిక్‌ను చూసినట్లయితే.. రామ్ చరణ్ నడుచుకుంటూ బిగ్ బాస్ సెట్‌కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక దీన్ని మెగా ఫ్యాన్స్ షేర్ చేస్తూ ఈ సారి చరణ్ అన్న బిగ్ బాస్‌కి వస్తే మాత్రం టీఆర్పీలు బద్దలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చీఫ్ గెస్ట్‌గా ఎవరు వస్తారో తెలియాలంటే ఈ రోజు సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా గతంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ వేర్వేరు సీజన్లలో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్టులుగా వచ్చిన సంగతి తెలిసిందే.