Bigg Boss: హౌస్‌లో గంభీరమైన వాయిస్ ఇచ్చే బిగ్‌బాస్‌ను ఎప్పుడైనా చూశారా?
తెలుగు ఇప్పటివరకు విజయవంతంగా ఏడు బిగ్‌బాస్ సీజన్లు ముగిశాయి.
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ఇప్పటివరకు విజయవంతంగా ఏడు బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్లు ముగిశాయి. ప్రస్తుతం 8 వ సీజన్ కొనసాగుతోంది. మరో రెండు వారాల్లో ఈ సీజన్ కూడా కంప్లీట్ అవ్వబోతుంది. చివరి దశలో ఉంది. అయితే హౌస్‌లో తెర వెనకుండి.. ఆటాడించే బిగ్‌బాస్ ఎవరు? అతడు ఎలా ఉంటాడు? అనే ఆలోచనలు చాలా మందిలో రేకెత్తే ఉంటాయి. మరీ ఆ కనిపించని బిగ్‌బాస్ ఎలా ఉంటాడు.. ఎవరో ఇప్పుడు చూద్దాం.. హౌస్‌లో ఎవరికి కనిపించకుండా కీలక పాత్ర పోషిస్తోన్న బిగ్‌బాస్ వాయిస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంతో గంభీరంగా ఉంటుంది. ఈ స్వరంతోనే నిద్రపోతున్న కంటెస్టెంట్స్(Contestants) కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తారు. ఈ గొంతు వినగానే బిగ్‌బాస్ ప్రియుల్లో కూడా ఎక్కడలేని క్యూరియాసిటీ(Curiosity) వస్తుంది. అయితే ఈయనది ఒక ఫిక్షనల్ రోల్(A fictional role) మాత్రమేనట. వాస్తవానికి బిగ్‌బాస్ అనే పర్సన్ అంటూ ఎవరూ లేరు. ఈ వాయిస్ ఇచ్చేది రేణుకుంట్ల శంకర్(Renukuntla Shankar). ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్. కేవలం బిగ్‌బాస్ హౌస్‌లో మాత్రమే కాకుండా శంకర్.. చాలా కాలం నుంచి పలు సీరియల్స్(serials), మూవీల(movies)కు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్(Dubbing artist)గా వర్క్ చేస్తూ వస్తున్నాడు.