భారీ ట్విస్ట్.. ఈసారి బిగ్‌బాస్ హౌస్లో డబుల్ ఎలిమినేషన్.. డేంజర్ జోన్‌లో ఒకరు?
నాగార్జున హోస్ట్ గా చేస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 సక్సెస్ ఫుల్‌గా మూడు వారాలు పూర్తి చేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్ గా చేస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 సక్సెస్ ఫుల్‌గా మూడు వారాలు పూర్తి చేసుకుంది. మూడు వారాల ఎలిమినేషన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం బిగ్‌బాస్ లవర్స్ అంతా నాలుగో వారం ఎలిమినేషన్ పై ఫుల్ ఆసక్తితో ఉన్నారు. జనాల్లో తెగ క్యూరియాసిటీ నెలకొంది. ఎవరూ హౌస్‌ను వీడి ఇంటి బాట పట్టనున్నారని జనాలు సోషల్ మీడియాలో చర్చలు పెడుతున్నారు. నాలుగో వారం ఎలిమినేషన్స్ లో బిగ్ బాస్ కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో నాలుగో వారం నామినేషన్స్ కాస్త వేడివేడిగా జరిగాయి. ఈ క్రమంలో నబీల్, సోనియా, పృథ్విరాజ్ మధ్య గొడవ జరుగుతుంది. ఇక నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యాక బిగ్‌బాస్ ఎవరెవరూ ఎలిమినేషన్స్ లో ఉన్నారు చెప్తాడు.
పృథ్విరాజ్, సోనియా, ప్రేరణ, ఆదిత్య, నాగ మణికంఠ, నైనిక, పేర్లు లిస్ట్ లో ఉన్నట్లు బిగ్ బాస్ ప్రకటిస్తాడు. అయితే ఈ వీక్ లో బిగ్‌బాస్ ఏకంగా ఇద్దరిని ఎలిమినేట్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియలో వైరల్ అవ్వగా.. ఇది ఊహించని పరిణామమే అంటున్నారు జనాలు. ప్రస్తుతం అయితే హౌస్ లో నబీల్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో నాగ మణికంఠ ఉన్నాడు. కానీ నాగమణికంఠను బిగ్ బాస్ చీకటి గదిలోకి పంపుతాడు. మరీ అతడు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికా? లేక? ఎలిమినేట్ అవుతాడా అనేది తెలియాలి. ఇక సోనియా మాత్రం పక్కా ఎలిమినేట్ అవుతుందని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ అయతే పృథ్వీ అయ్యే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. నాగమణికంఠ, సోనియా, పృథ్వీ ఎవరూ ఎలిమినేట్ అవ్వనున్నారో చూడాలి.