ఎడ్‌సెట్‌లో 98.53 శాతం ఉత్తీర్ణత
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎడ్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ఫలితాలు విడుదల చేశారు. బీఎడ్కోర్సులో ప్రవేశాలకు 42,399 మంది దరఖాస్తు చేసుకోగా.. 34,185 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 33,683 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ ఫలితాల్లో నల్లగొండ జిల్లా వాసి తిమ్మిశెట్టి మహేందర్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. మంచిర్యాలకు చెందిన ప్రత్యూష రెండో ర్యాంకు, పాట్నాకు చెందిన రిషికేశ్మూ […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎడ్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ఫలితాలు విడుదల చేశారు. బీఎడ్కోర్సులో ప్రవేశాలకు 42,399 మంది దరఖాస్తు చేసుకోగా.. 34,185 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 33,683 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ ఫలితాల్లో నల్లగొండ జిల్లా వాసి తిమ్మిశెట్టి మహేందర్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. మంచిర్యాలకు చెందిన ప్రత్యూష రెండో ర్యాంకు, పాట్నాకు చెందిన రిషికేశ్మూ డో ర్యాంకును సాధించారు. ఎడ్‌సెట్ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. 25,983 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 98.53 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు.