రష్యాలో లక్షకు చేరువవుతోన్న కరోనా కేసులు

మాస్కో : ప్రపంచంలోని పలుదేశాల్లో తగ్గుముఖం పడుతున్న కరోనా మహమ్మారి రష్యాలో వేగంగా వ్యాపిస్తోంది. రష్యా ప్రభుత్వం మొదట్లో తీసుకున్న కఠిన చర్యల కారణంగా కరోనా ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించింది. కాని యూరోప్ నుంచి వ్యాపించిన వైరస్.. ఇప్పుడు మాత్రం రష్యాలో వేగంగా ప్రబలుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,411 కరోనా పాజిటివ్‌లు నిర్ధారణ కాగా, మొత్తం కేసుల సంఖ్య 93,558కి చేరుకుంది. ఇదే రీతిలో కరోనా కేసులు నమోదైతే ఒకటి రెండు రోజుల్లో పాజిటివ్‌లు లక్షకు […]

Update: 2020-04-28 06:31 GMT

మాస్కో : ప్రపంచంలోని పలుదేశాల్లో తగ్గుముఖం పడుతున్న కరోనా మహమ్మారి రష్యాలో వేగంగా వ్యాపిస్తోంది. రష్యా ప్రభుత్వం మొదట్లో తీసుకున్న కఠిన చర్యల కారణంగా కరోనా ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించింది. కాని యూరోప్ నుంచి వ్యాపించిన వైరస్.. ఇప్పుడు మాత్రం రష్యాలో వేగంగా ప్రబలుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,411 కరోనా పాజిటివ్‌లు నిర్ధారణ కాగా, మొత్తం కేసుల సంఖ్య 93,558కి చేరుకుంది. ఇదే రీతిలో కరోనా కేసులు నమోదైతే ఒకటి రెండు రోజుల్లో పాజిటివ్‌లు లక్షకు చేరుకుంటాయని అధికారులు చెబుతున్నారు. వారం క్రితం కేసుల నమోదు తక్కువగానే ఉన్నా.. ఇప్పడు రోజుకు వందల సంఖ్యలో పాజిటివ్‌లు నిర్ధారణ అవుతుండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. వారం రోజుల నుంచి సగటున 6 వేల కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ మంది కరోనా బాధితులు ఉన్న దేశాల జాబితాలో రష్యా 8వ స్థానానికి చేరింది. వారం రోజుల్లోనే చైనా, ఇరాన్‌లను దాటేసింది.

Tags: Russia, Coronavirus, Positives, Tests, Covid 19

Tags:    

Similar News