తొమ్మిది నెలల గర్భిణి.. ఆరు నిమిషాల్లో 1.6 కి.మీ రన్నింగ్

దిశ, వెబ్‌డెస్క్: వ్యాయామం చేయడం మంచిదే.. కానీ 9 నెలల గర్భంతో రన్నింగ్ చేయడమేంటని? ఆశ్చర్యపోకండి. సంకల్పం, ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యమే. ఆ రెండింటితోనే కాలిఫోర్నియాకు చెందిన మెకన్నా మైలర్ తన కడుపులో పూర్తిగా ఎదిగిన బిడ్డను మోస్తూ కూడా 1.6 కి.మీ.ల దూరాన్ని ఆరు నిమిషాల్లో పరుగెత్తగలిగింది. స్వతహాగా అథ్లెట్, ఫిట్‌నెస్ ప్రియురాలు అయిన 28 ఏళ్ల మైలర్.. ట్రాక్ మీద పరిగెడుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. తనకు బిడ్డ పుట్టేలోపు ఈ […]

Update: 2020-10-19 04:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: వ్యాయామం చేయడం మంచిదే.. కానీ 9 నెలల గర్భంతో రన్నింగ్ చేయడమేంటని? ఆశ్చర్యపోకండి. సంకల్పం, ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యమే. ఆ రెండింటితోనే కాలిఫోర్నియాకు చెందిన మెకన్నా మైలర్ తన కడుపులో పూర్తిగా ఎదిగిన బిడ్డను మోస్తూ కూడా 1.6 కి.మీ.ల దూరాన్ని ఆరు నిమిషాల్లో పరుగెత్తగలిగింది. స్వతహాగా అథ్లెట్, ఫిట్‌నెస్ ప్రియురాలు అయిన 28 ఏళ్ల మైలర్.. ట్రాక్ మీద పరిగెడుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. తనకు బిడ్డ పుట్టేలోపు ఈ ఫీట్ పూర్తి చేయాలని తను ఎప్పుడో నిర్ణయించుకుంది. రోజూ కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ చివరకు అనుకున్నది సాధించింది.

సాధారణంగా 1.6 కి.మీ.లు రన్నింగ్ చేయడానికి 9 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. కానీ నెలలు నిండిన గర్భవతి అయ్యుండి కూడా 6 నిమిషాల్లో పూర్తిచేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఇలా రన్నింగ్ చేయడం వల్ల కడుపులో బిడ్డకు ప్రమాదం కాదా? అని ప్రశ్నించినవారు కూడా ఉన్నారు. అయితే తాను డాక్టర్ల సలహా మేరకే ఈ ఫీట్ చేసినట్లు మైలర్ తెలిపింది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ, కరోనా వైరస్ పాండమిక్ కారణంగా తాను చేసే వర్కవుట్‌లను చాలా వరకు మార్చుకున్నానని చెప్పింది. దీంతో ఈ రన్నింగ్ పూర్తి చేయగలుగుతానో లేదోనన్న నమ్మకం తనకు కూడా లేదని.. కాకపోతే డాక్టర్లు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తాను ఈ ఫీట్ సాధించగలిగినట్లు వెల్లడించింది. ఏదేమైనా ప్రెగ్నెన్సీ సమయంలో రిస్క్ తీసుకోవాలంటే నిజంగా చాలా ధైర్యం కావాలి.

Tags:    

Similar News