విజయవాడ జీజీహెచ్‌లో శవాల గుట్టలు.. చివరకు!
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ ఏపీలో మరణ మృదంగా మోగిస్తోంది. రోజువారీగా అక్కడ 11వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో పాటు మరణాల సంఖ్య కూడా బీభత్సంగా పెరుగుతోంది. ముఖ్యంగా విజయవాడలోని జీజీహెచ్ హాస్పిటల్‌లో కొవిడ్ రోగుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. విజయవాడలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో చాలా మంది కొవిడ్ రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. జీజీహెచ్‌లో ప్రాణవాయువు నిల్వ శాతం తగ్గిపోవడంతో మరణాల సంఖ్య పెరుగుతున్నట్లు సమాచారం. అయితే, మరణించిన వారి […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ ఏపీలో మరణ మృదంగా మోగిస్తోంది. రోజువారీగా అక్కడ 11వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో పాటు మరణాల సంఖ్య కూడా బీభత్సంగా పెరుగుతోంది. ముఖ్యంగా విజయవాడలోని జీజీహెచ్ హాస్పిటల్‌లో కొవిడ్ రోగుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. విజయవాడలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో చాలా మంది కొవిడ్ రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. జీజీహెచ్‌లో ప్రాణవాయువు నిల్వ శాతం తగ్గిపోవడంతో మరణాల సంఖ్య పెరుగుతున్నట్లు సమాచారం. అయితే, మరణించిన వారి మృతదేహాలను కలెక్ట్ చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో జీజీహెచ్‌లోని మార్చురీలో శవాల గుట్టలు పేరుకుపోతున్నాయి.
నాలుగు రోజుల నుంచి సుమారు 81మృతదేహాలు మార్చురీలోని ఒక దగ్గర కుప్పగా చేశారు. నార్మల్‌గా జీజీహెచ్‌లో 50 మృతదేహాలు పెట్టే వీలుంది. రెండు, మూడు రోజులుగా మరణించిన వారి కోసం బంధువులు రావడం లేదు. దీంతో మార్చురీ సిబ్బంది వారి కోసం ఎదురు చూస్తున్నారు. నిర్ణీత సమయం వరకు రాకపోతే మార్చురీ సిబ్బంది శవాలను కార్పొరేషన్‌కు అందజేస్తున్నారు. ఒక్క విజయవాడలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇంకెలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు.