టీఆర్ఎస్‌కు భారీ షాక్.. 75 కుటుంబాలు రాజీనామా

దిశ, నెక్కొండ: వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పెద్దకొర్పోల్ గ్రామంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గ్రామంలోని దాదాపు 75 కుటుంబాలు టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇందులో 50 కురుమ కులస్తుల కుటుంబాలు, 25 రేకులతండాకు చెందిన కుటుంబాలు ఉన్నాయి. ఈ సందర్భంగా వారికి దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాధవ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో […]

Update: 2021-10-17 06:48 GMT

దిశ, నెక్కొండ: వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పెద్దకొర్పోల్ గ్రామంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గ్రామంలోని దాదాపు 75 కుటుంబాలు టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇందులో 50 కురుమ కులస్తుల కుటుంబాలు, 25 రేకులతండాకు చెందిన కుటుంబాలు ఉన్నాయి. ఈ సందర్భంగా వారికి దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాధవ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ అవినీతి, అరాచక పాలనకు రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత, దళిత, గిరిజన, బలహీన వర్గాలు చరమగీతం పాడుతారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు లక్ష్మణ్, కురుమ సంఘం నాయకులు చేరాలు, ఐలయ్య, వెంకన్న, కట్టయ్య, వెంకన్న, మేడి అశోక్ తదితర 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే వెంట టీపీసీసీ మెంబర్ రంజిత్ రెడ్డి, మండల అధ్యక్షుడు అశోక్, నాయకులు హరీష్ రెడ్డి, హరిప్రసాద్, లక్ష్మణ్, సుబ్బారెడ్డి, శ్రీనివాస్, చెన్నకేశవులు, సాయికృష్ణ, శివకుమార్, మహిపాల్ రెడ్డి, ప్రశాంత్, ప్రభాకర్, ప్రశాంత్ పాల్గొన్నారు.

Tags:    

Similar News