తొలిరోజు 74శాతం అభ్యరులు హాజరు

దిశ, ఏపీ బ్యూరో: గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్షకు తొలిరోజు 3,44,448 మంది (74శాతం) అభ్యర్థులు హాజరైనట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. నిర్ణీత సమయానికి గంటన్నర ముందు అభ్యర్థులను అనుమతించగా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు జరిగాయి. కాగా విశాఖలో సచివాలయ ఉద్యోగ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా 277 పరీక్ష కేంద్రాల్లో లక్షా యాభైవేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ బస్సులు జిల్లావ్యాప్తంగా మారుమూల […]

Update: 2020-09-20 10:25 GMT

దిశ, ఏపీ బ్యూరో: గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్షకు తొలిరోజు 3,44,448 మంది (74శాతం) అభ్యర్థులు హాజరైనట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. నిర్ణీత సమయానికి గంటన్నర ముందు అభ్యర్థులను అనుమతించగా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు జరిగాయి. కాగా విశాఖలో సచివాలయ ఉద్యోగ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా 277 పరీక్ష కేంద్రాల్లో లక్షా యాభైవేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ బస్సులు జిల్లావ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో కూడా నడిపారు. కొవిడ్‌ కష్టకాలంలో నియామకాలకు సంబంధించిన పరీక్షలు జరపడంతో అభ్యర్థులు సీఎం జగన్‌కు అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News