అతిథులుగా పెళ్లికి వెళ్లారు.. కేసుల్లో ఇరుక్కున్నారు..

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేసులు పెరుగుతున్న కారణంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం ఆంక్షలు విధిస్తున్నాయి. కరోనా ప్రబలుతున్న వేళ మహారాష్ట్ర సర్కార్.. పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు 50 మందికి మించి హాజరు కావొద్దని ఆంక్షలు విధించింది. కానీ ప్రభుత్వ ఆంక్షలను పట్టించుకోకుండా థానే జిల్లాలోని కల్యాణ్‌లో జరిగిన ఓ పెళ్లికి ఏకంగా 700 మంది అతిథులు […]

Update: 2021-03-12 22:51 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేసులు పెరుగుతున్న కారణంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం ఆంక్షలు విధిస్తున్నాయి. కరోనా ప్రబలుతున్న వేళ మహారాష్ట్ర సర్కార్.. పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు 50 మందికి మించి హాజరు కావొద్దని ఆంక్షలు విధించింది. కానీ ప్రభుత్వ ఆంక్షలను పట్టించుకోకుండా థానే జిల్లాలోని కల్యాణ్‌లో జరిగిన ఓ పెళ్లికి ఏకంగా 700 మంది అతిథులు హాజరయ్యారు. ఈ విషయం కాస్త అధికారులకు తెలిసింది. కరోనా నిబంధనలు పాటించలేదనే కారణంతో పెళ్లి పెద్దలపై కేసులు నమోదు చేసినట్లు కల్యాణ్‌ డోంబివలి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (కేడీఎంసీ) అధికారులు తెలిపారు.

ఈ పెళ్లి మార్చి 10న జరిగింది, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అతిథులు వచ్చారని అధికారులు పేర్కొన్నారు. పెళ్లికి హాజరైనవారు మాస్కులు ధరించకుండా.. భౌతికదూరం పాటించుకుండా.. కరోనా నిబంధనలు పాటించలేదని పేర్కొన్నారు. దీంతో పెళ్లి జరిపించిన రాజేశ్‌ మాత్రే, మహేశ్‌ రావూత్‌లపై కేసులు నమోదు చేశామన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రతీ ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

 

Tags:    

Similar News