ఐర్లాండ్ నుంచి 700 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సృష్టిస్తున్న సంక్షోభంతో ఆక్సిజన్, వైద్య పరికరాల కొరతతో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు ఐర్లాండ్ అండగా నిలిచింది. భారత్‌కు 700 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఇతర మెడికల్ కిట్లను పంపిస్తామని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న ఐరిష్ ఎంబసీ ప్రతినిధి బ్రెండన్ వార్డ్ స్పందిస్తూ.. భారత్‌లో పరిస్థితులను ఐర్లాండ్ గమనిస్తున్నదని, ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇందులో భాగంగా 700 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వైద్య పరికరాలను ఐర్లాండ్ పంపిస్తున్నదని అన్నారు. బుధవారం ఉదయం నాటికి అవి […]

Update: 2021-04-27 09:04 GMT

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సృష్టిస్తున్న సంక్షోభంతో ఆక్సిజన్, వైద్య పరికరాల కొరతతో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు ఐర్లాండ్ అండగా నిలిచింది. భారత్‌కు 700 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఇతర మెడికల్ కిట్లను పంపిస్తామని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న ఐరిష్ ఎంబసీ ప్రతినిధి బ్రెండన్ వార్డ్ స్పందిస్తూ.. భారత్‌లో పరిస్థితులను ఐర్లాండ్ గమనిస్తున్నదని, ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఇందులో భాగంగా 700 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వైద్య పరికరాలను ఐర్లాండ్ పంపిస్తున్నదని అన్నారు. బుధవారం ఉదయం నాటికి అవి ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉన్నదని వార్డ్ తెలిపారు. ఇవేగాక భారత ప్రభుత్వానికి అవసరమైన సాయం చేయడానికి ఐర్లాండ్ సిద్ధంగా ఉన్నదని చెప్పారు. దేశంలో కొవిడ్ భయానక పరిస్థితులను చూసి యూఎస్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, పాకిస్థాన్ వంటి దేశాలు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News