గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అనంతరం కాలువలోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే విజయవాడకు చెందిన సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు కారులో శనివారం అర్థరాత్రి ఒంటిగంట సమీపంలో సూర్యలంక సముద్ర స్నానానికి వచ్చారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో బాపట్ల […]
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అనంతరం కాలువలోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే విజయవాడకు చెందిన సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు కారులో శనివారం అర్థరాత్రి ఒంటిగంట సమీపంలో సూర్యలంక సముద్ర స్నానానికి వచ్చారు.
తెల్లవారుజామున 4 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో బాపట్ల ఆదర్శనగర్ వద్దకు చేరుకోగానే వేగంగా ప్రయాణిస్తున్న కారు కరెంటు స్తంభాన్ని ఢీకొంది. అనంతరం కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు కారు అద్దాలు పగలగొట్టి వారందర్నీ రక్షించారు. అయితే ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధిరెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన మరో ఏడుగురిని స్థానిక వైద్యశాలకు తరలించారు. నిహారిక, సాయి, తులసి అనే ఇద్దరు విద్యార్థుల తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో మత్స్యకారులు స్పందించకుంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు.