ఏపీలో డీఎంహెచ్‌వోల బదిలీ..
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల వైద్యాధికారులను బదిలీ చేస్తూ జగన్ సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా డీఎంహెచ్‌వోగా కేసీ చంద్రనాయక్ బాధ్యతలు చేపట్టనుండగా, పీఎస్ సూర్యనారాయణ విశాఖ జిల్లా వైద్యాధికారిగా బదిలీ అయ్యారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా డీఎంహెచ్‌వోగా కేవీఎస్ గౌరేశ్వరరావు, కృష్ణా జిల్లాకు ఎం.సుహాసిని, ప్రకాశం జిల్లాకు పి.రత్నవళి, […]
దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల వైద్యాధికారులను బదిలీ చేస్తూ జగన్ సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా డీఎంహెచ్‌వోగా కేసీ చంద్రనాయక్ బాధ్యతలు చేపట్టనుండగా, పీఎస్ సూర్యనారాయణ విశాఖ జిల్లా వైద్యాధికారిగా బదిలీ అయ్యారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా డీఎంహెచ్‌వోగా కేవీఎస్ గౌరేశ్వరరావు, కృష్ణా జిల్లాకు ఎం.సుహాసిని, ప్రకాశం జిల్లాకు పి.రత్నవళి, చిత్తూరు జిల్లాకు ఎం.పెంచలయ్య (ఇన్చార్జి) డీఎంహెచ్‌ఓలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.