కాబూల్ ఎయిర్‌పోర్టులో తొక్కిసలాట.. ఏడుగురు మృతి

దిశ, వెబ్‌డెస్క్ : ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద కాల్పులు జరిపారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ఉండటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందారు. అయితే ఆప్ఘన్‌లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి సేఫ్‌గా చేరుకున్నారు. ఆదివారం ఉదయం కాబూల్ నుంచి భారత వైమానిక దళ విమానం సీ-17లో 168 మంది ప్రయాణీకులు యూపీకి చేరుకున్నారు. వారిలో భారతీయులు 107 […]

Update: 2021-08-22 02:37 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద కాల్పులు జరిపారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ఉండటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందారు.

అయితే ఆప్ఘన్‌లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి సేఫ్‌గా చేరుకున్నారు. ఆదివారం ఉదయం కాబూల్ నుంచి భారత వైమానిక దళ విమానం సీ-17లో 168 మంది ప్రయాణీకులు యూపీకి చేరుకున్నారు. వారిలో భారతీయులు 107 మంది ఉన్నారు. విమానం ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్‌లోని హిండన్ వైమానిక స్థావరంలో ల్యాండ్ అయింది.

Tags:    

Similar News