ఏపీలో 2,500 దాటిన కరోనా కేసులు
దిశ ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 17,251 మందికి పరీక్షలు చేయగా 113 మందికి కరోనా సోకింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,605కి చేరింది. ఇందులో ఏపీకి చెందిన వారు 2,452 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 153 మందికి కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు. ఏపీలో తొలి 500 […]
దిశ ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 17,251 మందికి పరీక్షలు చేయగా 113 మందికి కరోనా సోకింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,605కి చేరింది. ఇందులో ఏపీకి చెందిన వారు 2,452 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 153 మందికి కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు.
ఏపీలో తొలి 500 కేసులకు 25 రోజులు పట్టగా, ప్రస్తుతం 9 రోజుల్లోనే 500 కేసుల మార్కు దాటేయడం గమనార్హం. గత మార్చి 21న రాష్ట్రంలో కేవలం 5 కేసులు మాత్రమే ఉండగా, ఏప్రిల్ 15 నాటికి ఏకంగా 525కు చేరుకున్నాయి. ఆ తర్వాతి నుంచి వేగంగా పెరుగుతూ బుధవారానికి 2,605 కేసులకు చేరుకున్నాయి. ఒకవైపు ఎక్కువ మంది ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తూనే.. ఇంకోవైపు కట్టడి చేయలేక కరోనాతో సహజీవనం తప్పదని ప్రకటనలు చేస్తోంది. దీంతో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది.