ఇందూరు గడ్డపై రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు

దిశ, నిజామాబాద్: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వలన నిలిచిపోయిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు తిరిగి ప్రారంభమైంది. సోమవారం తిరుపతి నుంచి బయలు దేరిన ఈ రైలు మంగళవారం నిజామాబాద్(ఇందూరు) రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఈ రైలులో 68మంది ప్రయాణికులు వచ్చారు.వారిలో నిజామాబాద్ వాసులు 41 మంది, మంచిర్యాల 2 , కామారెడ్డి 2, జగిత్యాల 5, నిర్మల్ 14, మహరాష్ర్టలోని నాందేడ్‌కు చెందిన వారు 4, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 4గురు జర్నీ చేశారని […]

Update: 2020-06-02 08:29 GMT

దిశ, నిజామాబాద్: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వలన నిలిచిపోయిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు తిరిగి ప్రారంభమైంది. సోమవారం తిరుపతి నుంచి బయలు దేరిన ఈ రైలు మంగళవారం నిజామాబాద్(ఇందూరు) రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఈ రైలులో 68మంది ప్రయాణికులు వచ్చారు.వారిలో నిజామాబాద్ వాసులు 41 మంది, మంచిర్యాల 2 , కామారెడ్డి 2, జగిత్యాల 5, నిర్మల్ 14, మహరాష్ర్టలోని నాందేడ్‌కు చెందిన వారు 4, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 4గురు జర్నీ చేశారని స్టేషన్ మాస్టర్ రవి కుమార్ వెల్లడించారు. ఇందూరులో అడుగు పెట్టిన 68 మందికి మందుగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. వీరందరి వివరాలు సేకరించి హోం క్వారంటైన్ ముద్రలు వేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ సుదర్శనం ప్రకటించారు.అయితే నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి టికెట్లు అన్ని ఆన్‌లైన్ బుకింగ్ జరిగాయని, అదేవిధంగా స్టేషన్ మొత్తం సానిటైజేషన్ చేస్తున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణం కోసం వచ్చిన వారు భౌతిక దూరం, మాస్కులు లేకుండా వస్తే అనుమతించడం లేదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కేవలం గంటకు ఐదు వందల మందికి మాత్రమే దర్శనం లభిస్తున్న నేపథ్యంలో ఈ రైలులో చాలా మంది భక్తులు ప్రయాణాలు మానుకున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News