భారీగా గంజాయి పట్టివేత
దిశ, విశాఖపట్నం: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ముష్టిపల్లి కూడలి వద్ద ఓ వ్యానులో గోనెసంచుల మాటున గంజాయి తరలిస్తున్న ముఠాను ఎస్.కోట పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజకుమారి మీడియాకు వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారం మేరకు ముష్టిపల్లి కూడలి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. గోనె సంచులతో వెళ్తున్న ఐచర్ వ్యాన్(లారీ)లో తనిఖీలు నిర్వహించగా 50 గంజాయి గుర్తించారు. దాని విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసులో […]
దిశ, విశాఖపట్నం: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ముష్టిపల్లి కూడలి వద్ద ఓ వ్యానులో గోనెసంచుల మాటున గంజాయి తరలిస్తున్న ముఠాను ఎస్.కోట పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజకుమారి మీడియాకు వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారం మేరకు ముష్టిపల్లి కూడలి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. గోనె సంచులతో వెళ్తున్న ఐచర్ వ్యాన్(లారీ)లో తనిఖీలు నిర్వహించగా 50 గంజాయి గుర్తించారు. దాని విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన నర్సీపట్నం ప్రాంతానికి చెందిన ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశామని ఎస్పీ తెలిపారు. అంతేగాకుండా మరో నలుగురు పరారీలో ఉన్నట్టు తెలిపారు. 50 సంచుల గంజాయి, లారీ ఐచర్ వ్యాన్, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.