ఇది మీకొక తియ్యని వార్త
దిశ, వెబ్‌డెస్క్: “ఫుల్ బిజీ.. అసలు ఏ మాత్రం కూడా సమయం దొరకడంలేదు. ఒకవేళ దొరికినా కూడా అది సరిపోదు. అలా కాదనుకుంటే ఏదోఒకటి పోగొట్టుకోవాల్సివస్తోంది. ఇలా అయితే కష్టమేమో.. నేను తీవ్రంగా నష్టపోవాల్సి వస్తదేమో. ఇంతకూ నా చింతన తీర్చే మార్గమే లేదా?” అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే.. అదేంటో చదవండి.. చాలామందికి ఎన్నో పనుల కారణంగా ఫుల్ బిజీగా ఉంటారు. కనీసం తినడానికి కూడా సమయం దొరకడంలేదు. ఒకవేళ తినాలనుకున్నా […]
దిశ, వెబ్‌డెస్క్: “ఫుల్ బిజీ.. అసలు ఏ మాత్రం కూడా సమయం దొరకడంలేదు. ఒకవేళ దొరికినా కూడా అది సరిపోదు. అలా కాదనుకుంటే ఏదోఒకటి పోగొట్టుకోవాల్సివస్తోంది. ఇలా అయితే కష్టమేమో.. నేను తీవ్రంగా నష్టపోవాల్సి వస్తదేమో. ఇంతకూ నా చింతన తీర్చే మార్గమే లేదా?” అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే.. అదేంటో చదవండి..
చాలామందికి ఎన్నో పనుల కారణంగా ఫుల్ బిజీగా ఉంటారు. కనీసం తినడానికి కూడా సమయం దొరకడంలేదు. ఒకవేళ తినాలనుకున్నా ఆ ఉన్న సమయంలో ప్రయోజనకరమైన ఆహారం తీసుకోవడంలేదు. దీంతో ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవ్వడం తప్పడంలేదు. అంతేకాదు శారీరక దేహదారుడ్యం తగ్గుతోంది. కొందరైతే తమ అందాన్ని కూడా పూర్తిగా కోల్పోతున్నారు. దీంతో వారికి అంతర్మథనం తప్పడంలేదు. ముఖ్యమంగా యువతను అత్యధికంగా పట్టిపీడిస్తున్న సమస్య ఇదే.
ఈ విధంగా అంతర్మథనం చెందుతున్న వారికోసం ప్రత్యేకంగా పలు సూచనలతో ఓ తియ్యని స్టోరీని అందిస్తున్నాం. మీరు చదివే ఈ సూచనను వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాదు ఈ విధానాన్ని పాటించిన పలువురు ఆ సమస్యకు చెక్ పెట్టేశారు. అందుకోసమే మీరు కూడా మా సూచనను ఫాలో అవ్వండి.
మనలో చాలామంది గజిబిజి షెడ్యూల్‌ను అనుసరిస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో సమతుల్య ఆహారం కోసం ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే అది వాళ్లను ఎప్పుడు కూడా ఫిట్ గా ఉండేలా చేస్తుంది. జిమ్ చేసే వారైతే ప్రత్యేకంగా దీనిపైనే దృష్టి పెడుతుంటారు. ఇగ యువత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే.. ఇలాంటి వారి కోసం ఓ ప్రత్యేకమైన తియ్యని ఆహారాన్ని తీసుకోవాలని మేం సూచిస్తున్నాం. అదేమిటంటే.. ఓ తియ్యటి పదార్థం. అదేనండి.. అరటిపండు. ఇది మీరు రోజూ ప్రత్యేకంగా తీసుకుంటే దాని వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ఎందుకంటే అరటిలో ఎన్నో రకాలైన పోషకాలు ఉంటాయి. దాంతో మీరు ఎల్లప్పుడూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. అంతేకాదు ఎన్నో రకాలైన ప్రయోజనాలను మీకందిస్తుంది.
మీరు నాణ్యత గల అరటిపండ్లను మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే నాణ్యత గల అరటిపండ్లు 75 శాతం నీరు చాలా తక్కువ సాంద్రతతో ఉంటుంది. ఈ వేసవి సీజన్ కఠినంగా ఉంటుంది కాబట్టి, అది మిమ్మల్ని బాగా హైడ్రేట్‌గా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. మీరు రెండు అరటిపండ్లను తీసుకుంటే అవి మీకు పూర్తిస్థాయి భోజనానికి సమానంగా ఉపయోగపడుతుంది. అరటిలో ముఖ్యంగా పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల మీకు జీర్ణక్రియ, మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, రక్తపోటును తగ్గించేందుకు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు మీకు భవిష్యత్‌లో తలెత్తే కనిపించని ఆరోగ్య సమస్యలను సైతం ఇది రాకుండా చేయగలగుతుంది. వ్యాయం చేసేవారికైతే.. ఒకవేళ వారు ఒకరోజు వ్యాయమాన్ని దాటవేయాల్సి వస్తే ఈ అరటిపండ్లు రెండు తీసుకుంటే సరిపోతుంది. ఇలా అరటి పండు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.
అందువల్ల అరటి పండు ప్రతిరోజూ తీసుకుంటే చాలా మంచిదని చెబుతున్నారు. ఈ వేసవిలో అయితే ఇది తప్పకుండా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఆరోగ్యానికి తేనె ఎంతో మేలు..