ఆటోలో ఉన్న వ్యక్తులు అరెస్ట్.. రివార్డు అందించిన సీపీ

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు డీసీపీ(లాఅండ్ ఆర్డర్) డాక్టర్ వినిత్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 10న మధ్యాహ్నం నగరంలోని బాబాన్ సహబ్ పహడ్ ప్రాంతంలో నగర రూరల్ నార్త్ సీఐ గురునాథ్, ఎస్ఐ శ్యాం సుంధర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలను నిర్వహించారు. ఆటోలో వెళ్తున్న వ్యక్తులు […]

Update: 2021-12-11 05:38 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు డీసీపీ(లాఅండ్ ఆర్డర్) డాక్టర్ వినిత్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 10న మధ్యాహ్నం నగరంలోని బాబాన్ సహబ్ పహడ్ ప్రాంతంలో నగర రూరల్ నార్త్ సీఐ గురునాథ్, ఎస్ఐ శ్యాం సుంధర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలను నిర్వహించారు. ఆటోలో వెళ్తున్న వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 44 కిలోల గంజాయి, రెండు ఆటోలు, పల్సర్ బైక్, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ముజాహిద్ నగర్ కు చెందిన ఉస్మాన్ ఖాన్, దొడ్డి కొమురయ్య కాలనీకి చెందిన షెక్ మోయిజ్, వెంగళ్ రావు నగర్ కు చెందిన షేక్ సిరాజ్, కోటగల్లికి చెందిన భధ్రమైన సుధాకర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేటకు చెందిన కడారి రాజులతోపాటు ఓ మైనర్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. భూపాలపల్లి జిల్లా నుంచి వయా నిజామాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో పట్టుబడిన వారిపై పాత కేసులు ఉన్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్నవారిని పట్టుకున్న పోలీసులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ అభినంధించి రివార్డు అందించినట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ఏసీపీ వేంకటేశ్వర్లు, నార్త్ రూరల్ సీఐ గురునాథ్, ఎస్ఐ శ్యాం సుందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News