57 వేల ఏళ్లైనా.. చెక్కుచెదరని కళేబరం

దిశ, వెబ్ డెస్క్: జంతువులు చనిపోయాక వాటి శరీరాలు కొద్దిరోజుల్లోనే కుళ్లిపోతాయని అందరికీ తెలుసు. కానీ, కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయిన ఓ తోడేలు పిల్ల మృతదేహం మాత్రం.. చెక్కు చెదరకుండా ఉండటంతో సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. వేలాది సంవత్సరాల పాటు కళేబరం పూర్తిగా పాడవుకుండా ఎలా ఉంది? ఇది ఎలా సాధ్యం? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. ఉత్తర కెనడాలోని యుకాన్ ప్రాంతంలోని డాసన్ సిటీ సమీపంలో గోల్డ్ మైనర్స్‌ తవ్వకాల్లో తోడేలు పిల్ల అవశేషాలు […]

Update: 2020-12-25 09:21 GMT

దిశ, వెబ్ డెస్క్: జంతువులు చనిపోయాక వాటి శరీరాలు కొద్దిరోజుల్లోనే కుళ్లిపోతాయని అందరికీ తెలుసు. కానీ, కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయిన ఓ తోడేలు పిల్ల మృతదేహం మాత్రం.. చెక్కు చెదరకుండా ఉండటంతో సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. వేలాది సంవత్సరాల పాటు కళేబరం పూర్తిగా పాడవుకుండా ఎలా ఉంది? ఇది ఎలా సాధ్యం? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

ఉత్తర కెనడాలోని యుకాన్ ప్రాంతంలోని డాసన్ సిటీ సమీపంలో గోల్డ్ మైనర్స్‌ తవ్వకాల్లో తోడేలు పిల్ల అవశేషాలు బయటపడగా, అది ఏడు వారాల వయస్సుగల ఆడతోడేలు కళేబరమని పరిశోధకులు తేల్చారు. గుహలో నివసిస్తున్న ఆ తోడేలు పిల్లపై హాఠాత్తుగా ఆ మంచుగుహ కూలిపోవడంతో అది మరణించినట్లు పరిశోధకులు అంచనా వేశారు. 57 వేల ఏళ్ల క్రితం ఇది మరిణించందని అంచనాకు వచ్చిన పరిశోధకులు, మంచులో కూరుకుపోవడంతోనే ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందని భావిస్తున్నారు.

ఆనాటి తోడేళ్లు నది సమీపాల్లో జీవించేవనీ, అవి సాల్మన్ చేపలను ఆహారంగా తీసుకునేవని పరిశోధకులు వెల్లడించారు. దాని డీఎన్ఏ‌ను ప్రస్తుతం ఉన్న తోడేళ్ల డీఎన్‌ఏతో పోల్చి చూడగా, ఉత్తర అమెరికాలో ప్రస్తుతం నివసిస్తున్న తోడేళ్లతో వీటికి సంబంధాలు ఉన్నాయని వారు గుర్తించారు. ఇది అప్పట్లో యూరేషియాలో జీవించిన తోడేళ్ల కుటుంబానికి చెందినవిగా గుర్తించారు. తోడేలు అస్థిపంజరాన్ని ఎక్స్‌రే ద్వారా పరిశీలించామని, దంతాలకు ఉండే ఎనామిల్ నమూనాలను పలు కోణాల్లో విశ్లేషించగా, దీని ద్వారా మంచుయుగం నాటి పరిస్థితుల్లో భూమి ఎలా ఉంది? ఆ కాలంలో జీవించిన తోడేళ్లు ఎలా ఉండేవి అనే విషయాలు విశ్లేషించటానికి ఉపయోగపడుతుందని డెస్ మోయిన్స్ యూనివర్సిటీ అనాటమీ ప్రొఫెసర్ జూలీ మీచెన్ వెల్లడించారు. తోడేలు కళేబరానికి ‘ఝుర్‌’గా నామకరణం చేశారు. ఝర్ అంటే హాన్‌ భాషలో తోడేలు అనే అర్థం వస్తుంది.

Tags:    

Similar News