తిరుమలలో 57మంది వేదపాఠశాల విద్యార్థులకు కరోనా
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో మరోసారి కరోనా కల్లోలం సృష్టించింది. ధర్మగిరి వేదపాఠశాలలోని 57 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కరోనా నిర్ధారణ అయిన వారిని తిరుపతి స్విమ్స్ కి తరలించినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్-19 నేపథ్యంలో లాక్‌డౌన్ అనంతరం 5 రోజుల క్రితం ధర్మగిరి వేద పాఠశాల తెరిచారు. మొత్తం 435 మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. వీరందరూ తమ స్వస్థలాల్లో కోవిడ్ ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేయించుకుని నెగెటివ్ రిపోర్టు సమర్పించారు. అయితే […]
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో మరోసారి కరోనా కల్లోలం సృష్టించింది. ధర్మగిరి వేదపాఠశాలలోని 57 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కరోనా నిర్ధారణ అయిన వారిని తిరుపతి స్విమ్స్ కి తరలించినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్-19 నేపథ్యంలో లాక్‌డౌన్ అనంతరం 5 రోజుల క్రితం ధర్మగిరి వేద పాఠశాల తెరిచారు. మొత్తం 435 మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. వీరందరూ తమ స్వస్థలాల్లో కోవిడ్ ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేయించుకుని నెగెటివ్ రిపోర్టు సమర్పించారు. అయితే మార్చి 9న విద్యార్థులందరికీ మరోసారి కరోనా ర్యాపిడ్ టెస్ట్ లు నిర్వహించారు.
ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోయినా 57 మంది విద్యార్థులకు పాటిజివ్ రిపోర్టు వచ్చింది. అప్రమత్తమైన అధికారులు వారిని వెంటనే మెరుగైన వైద్య చికిత్సల కోసం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. స్విమ్స్ లో ఆ 57 మందికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే రిజల్ట్స్ రావాల్సి ఉంది. ప్రస్తుతం వేద పాఠశాలలోని విద్యార్థులు అంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని తెలుస్తోంది. మరోవైపు మిగిలిన 378 మంది విద్యార్థులకు, 35 మంది అధ్యాపకులకు, 10 మంది ఇతర సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చింది.