భారత్ కరోనా @1,12,359
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాచుతోంది. గత వారం రోజుల నుంచి ప్రతి రోజు 5 వేల పైబడి కేసులు నమోదవుతుడటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,609 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 132 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులను కలుపుకుంటే మొత్తం బాధితుల సంఖ్య 1,12,359కి చేరింది. వీరిలో 3,435 […]
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాచుతోంది. గత వారం రోజుల నుంచి ప్రతి రోజు 5 వేల పైబడి కేసులు నమోదవుతుడటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,609 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 132 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులను కలుపుకుంటే మొత్తం బాధితుల సంఖ్య 1,12,359కి చేరింది. వీరిలో 3,435 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 45,300 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 63,624 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక రాష్ట్రాల వారిగా చూస్తే 39,297 కేసులతో మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 13,191 కేసులతో తమిళనాడు రెండో స్థానంలో.. 12,537 కేసులతో గుజరాత్ మూడో ప్లేస్‌లో కొనసాగుతోంది.