HYDలో మరోసారి డ్రగ్స్ కలకలం..

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. బుధవారం నగర శివారులో పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ ఫార్మా కంపెనీ ఆవరణలో సుమారు 52కిలోలకుపైగా మత్త పదార్ధాలను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. నగర శివారులోని ఫార్మా కంపెనీలో గత 5రోజులుగా డీఆర్‌ఐ ప్రత్యేక బృందాలు సోదాలు జరుపుతున్నాయి. కంపెనీ కార్యాలయంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే, ఎవరికీ కనిపించకుండా మత్తు మందులను భూమిలో పాతిపెట్టినట్లు డీఆర్‌ఐ బృందాలు గుర్తించాయి. […]

Update: 2020-08-19 11:07 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. బుధవారం నగర శివారులో పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ ఫార్మా కంపెనీ ఆవరణలో సుమారు 52కిలోలకుపైగా మత్త పదార్ధాలను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. నగర శివారులోని ఫార్మా కంపెనీలో గత 5రోజులుగా డీఆర్‌ఐ ప్రత్యేక బృందాలు సోదాలు జరుపుతున్నాయి.

కంపెనీ కార్యాలయంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే, ఎవరికీ కనిపించకుండా మత్తు మందులను భూమిలో పాతిపెట్టినట్లు డీఆర్‌ఐ బృందాలు గుర్తించాయి. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వారి నుంచి కీలక సమాచారం రాబట్టిన అధికారులు.. మంగళవారం రాత్రి భూమిలో పూడ్చిన మాదక ద్రవ్యాలను వెలికితీశారు. వాటిలో 45 కిలోల ఎపిడ్రిన్, 7.5 కిలోల మెఫెడ్రోన్ ఉన్నట్లు తేలింది. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ దాదాపు రూ.6 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వీటిని అక్కడ దాచిన ముఠా కార్యకలాపాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు డీఆర్‌ఐ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు. డ్రగ్స్ ముఠా వెనుక ఎవరున్నారు? నగరంలో ఇవి ఎలా చేతులు మారుతున్నాయి. ఎవరు సరఫరా చేస్తున్నారు? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News