మహబూబ్నగర్లో 51 వేల మందికి ఉపాధి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, మహబూబ్‌నగర్: ఉపాధి హామీ పథకం కింద మహబూబ్‌నగర్ జిల్లాలో 51 వేల మంది కూలీలకు పనులు కల్పిస్తున్నట్లు మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పల్లెమోని కాలనీ వద్ద అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూలీలకు శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పారు. కూలీలు ఇబ్బందులు పడకుండా పనిచేసే చోట తాగునీటితోపాటు, […]
దిశ, మహబూబ్‌నగర్: ఉపాధి హామీ పథకం కింద మహబూబ్‌నగర్ జిల్లాలో 51 వేల మంది కూలీలకు పనులు కల్పిస్తున్నట్లు మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పల్లెమోని కాలనీ వద్ద అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూలీలకు శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పారు. కూలీలు ఇబ్బందులు పడకుండా పనిచేసే చోట తాగునీటితోపాటు, నీడ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ కాలంలో కూడా జిల్లా అంతటా ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేశామని, అయినప్పటికీ జిల్లా ప్రజలు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు.
Tags: minister srinivas goud, inspection, Employment guarantee works, mahabubnagar