5మినట్స్‌లో కరోనా టెస్ట్.. 10మినట్స్‌లో రిజల్ట్

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇదివరకు కరోనా పరీక్షకు శాంపిల్స్ ఇచ్చాక రిజల్ట్ కోసం మూడు రోజులు ఆగాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ‘సంజీవిని’ సంచార ల్యాబ్‌లతో టెస్టు చేయించుకున్న వ్యక్తులకు పది నిమిషాల్లోనే ఫలితం తెలుస్తోంది. రాష్ట్రంలో వైరస్ బాగా విస్తరిస్తున్న నేపధ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా డిపోల్లో ఉన్న ఇంద్ర బస్సులను ‘సంజీవిని’ పేరుతో కరోనా టెస్టింగ్ సెంటర్లుగా మార్చింది. వీటిల్లో ర్యాపిడ్ యాంటీ టెస్టింగ్ కిట్‌లను […]

Update: 2020-07-19 11:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇదివరకు కరోనా పరీక్షకు శాంపిల్స్ ఇచ్చాక రిజల్ట్ కోసం మూడు రోజులు ఆగాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ‘సంజీవిని’ సంచార ల్యాబ్‌లతో టెస్టు చేయించుకున్న వ్యక్తులకు పది నిమిషాల్లోనే ఫలితం తెలుస్తోంది.

రాష్ట్రంలో వైరస్ బాగా విస్తరిస్తున్న నేపధ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా డిపోల్లో ఉన్న ఇంద్ర బస్సులను ‘సంజీవిని’ పేరుతో కరోనా టెస్టింగ్ సెంటర్లుగా మార్చింది. వీటిల్లో ర్యాపిడ్ యాంటీ టెస్టింగ్ కిట్‌లను ఉపయోగించి వేగవంతంగా కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ బస్సుల్లో ఒకేసారి పది మందికి పరీక్ష చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనికి దాదాపు రూ. 3 లక్షలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. కాగా, కరోనా పరీక్ష, ఫలితాల వెల్లడి కేవలం 15 నిమిషాల్లోనే పూర్తవుతుంది.

Tags:    

Similar News