అంకిత్‌‌ శర్మ మృతదేహం దొరికిన నాలాలోనే..

దిశ, ఢిల్లీ : ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో జరిగిన అల్లర్లలో మరణించిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.ఆదివారం అంకిత్ శర్మ మృతదేహం లభించిన నాలాలోనే మరో 5మృత దేహాలు లభ్యమైనట్టు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. వీరిని అల్లరి మూకలు తీవ్రంగా కొట్టి హత్యచేసిన అనంతరం నాలాలో పడవేసినట్టు ఢిల్లీ పో్లీసులు భావిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు మృతుల సంఖ్య 45కు పైగా చేరినట్టు సమాచారం.ఇదిలా ఉండగా ఢిల్లీలో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.మరోవైపు షాషిన్‌బాగ్‌లో సీఏఏ […]

Update: 2020-03-01 10:02 GMT

దిశ, ఢిల్లీ :
ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో జరిగిన అల్లర్లలో మరణించిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.ఆదివారం అంకిత్ శర్మ మృతదేహం లభించిన నాలాలోనే మరో 5మృత దేహాలు లభ్యమైనట్టు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. వీరిని అల్లరి మూకలు తీవ్రంగా కొట్టి హత్యచేసిన అనంతరం నాలాలో పడవేసినట్టు ఢిల్లీ పో్లీసులు భావిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు మృతుల సంఖ్య 45కు పైగా చేరినట్టు సమాచారం.ఇదిలా ఉండగా ఢిల్లీలో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.మరోవైపు షాషిన్‌బాగ్‌లో సీఏఏ వ్యతిరేక నిరసనలు జరగకుండా ఉండేందుకు 144 సెక్షన్ విధించి దాదాపు 1000మంది పోలీసులు, 12కంపెనీల బలగాలతో కేంద్రం ప్రభుత్వం గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది.

Tags:    

Similar News