ఆ పార్టీ కార్యకర్తలకు తీపికబురు.. 481 మందికి కీలక పదవులు
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పదవుల కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 మందిని డైరెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ల నియామకం ఊసే లేదన్నారు. వైఎస్ జగన్ స్వయంగా డైరెక్టర్ల నియామకంలో పాల్గొని అన్ని వర్గాలకు పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు. 481 డైరెక్టర్ల […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పదవుల కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 మందిని డైరెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ల నియామకం ఊసే లేదన్నారు. వైఎస్ జగన్ స్వయంగా డైరెక్టర్ల నియామకంలో పాల్గొని అన్ని వర్గాలకు పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు. 481 డైరెక్టర్ల పదవుల్లో ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం, ఓసీలకు 42శాతం కేటాయించినట్లు తెలిపారు.
వీటిలో అత్యధికంగా మహిళలకు 52 శాతం అవకాశం కల్పించినట్లు సజ్జల తెలిపారు. చంద్రబాబు కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని చెప్పుకొచ్చారు. రాజ్యసభ సీటు విషయంలో ఎస్సీలను అవమానించారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంక్‌గానే చంద్రబాబు చూస్తే..సీఎం జగన్ వారందరికీ పెద్దపీట వేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో హోం మంత్రి మేకపాటి సుచరిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు.