దేశంలో కరోనా @ 40 వేలు

– ఒక్క రోజే 2487 పాజిటివ్ కేసులు దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య రోజుకో కొత్త రికార్డు నమోదు చేస్తోంది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2487 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. కరోనా దేశంలో ప్రవేశించినప్పటి నుంచి శనివారం అత్యధికంగా నమోదైన 2411 కేసులతో పోలిస్తే 76 కేసులు ఎక్కువగా నమోదు కావడంతో.. ఆదివారానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 40,263కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 1306 మంది మరణించగా, ఆదివారం […]

Update: 2020-05-03 11:29 GMT

– ఒక్క రోజే 2487 పాజిటివ్ కేసులు

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య రోజుకో కొత్త రికార్డు నమోదు చేస్తోంది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2487 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. కరోనా దేశంలో ప్రవేశించినప్పటి నుంచి శనివారం అత్యధికంగా నమోదైన 2411 కేసులతో పోలిస్తే 76 కేసులు ఎక్కువగా నమోదు కావడంతో.. ఆదివారానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 40,263కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 1306 మంది మరణించగా, ఆదివారం ఒక్కరోజే 83 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో కరోనా వల్ల ఒక్కరోజులో సంభవించిన అత్యధిక మరణాల సంఖ్య ఇదే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక దేశంలో ఇప్పటిదాకా డిశ్చార్జి అయిన కరోనా రోగులు 10887 మంది ఉండగా, ఆదివారం 869 మంది డిశ్చార్జి అయ్యారు. రెండో విడత లాక్‌డౌన్‌లో ఆంక్షలను సడలించేనాటికి (ఏప్రిల్ 20) దేశం మొత్తం మీద 17,656 కేసులుంటే ఇప్పుడు అది 40 వేలు దాటింది. ఆంక్షలను సడలించిన 13 రోజుల వ్యవధిలో 23 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం 58 కొత్త పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1583కు చేరింది. ఇక్కడ ఇప్పటి వరకు 488 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 33 మంది చనిపోయారు. మహారాష్ట్రలో ఆదివారానికి మొత్తం కేసుల సంఖ్య 12296కు చేరుకోగా వీటిలో రాష్ట్ర రాజధాని, దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబైలోనే 8613 కేసులు ఉన్నాయి. ఆదివారం ఒక్క రోజే ముంబైలో 441 కొత్త కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు కరోనా వల్ల 343 మంది చనిపోయారు. ఆదివారం ఒక్కరోజే 21 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2000 మంది డిశ్చార్జ్ అవగా 521 మంది చనిపోయారు. వీరిలో 36 మంది ఆదివారం మరణించారు. తెలంగాణలో సింగిల్ డిజిట్‌కు తగ్గిపోతాయనుకున్న కొత్త పాజిటివ్ కేసులు మళ్ళీ డబుల్ డిజిట‌్‌లోకి వచ్చాయి. ఆదివారం కొత్తగా నమోదైన 21 కేసుల్లో జగిత్యాలలో ఒక్కటి మినహా మిగిలిన 20 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి.

చెన్నైలో చెలరేగుతున్న మహమ్మారి

తమిళనాడులో ఆదివారం 266 కొత్త కేసులు నమోదై కరోనా విజృంభించింది. కొత్తగా నమోదైన ఈ కేసుల్లో 203 మంది చెన్నై నగరానికి చెందిన వారే కావడం నగర వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ ఇప్పటి వరకు 1379 మంది డిశ్చార్జి కాగా, ఆదివారం ఒక్క రోజే 38 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. 30 మంది చనిపోగా ఆదివారం ఒకరు మరణించారు.

Tags: 40000 corona cases india in single day, corona, india, sunday, cases

Tags:    

Similar News