4000 కొవిడ్ రక్షిత కోచ్‌లు 64,000 పడకలు సిద్ధం
దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ నివారణకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలు వినియోగించుకోవడానికి అనుగుణంగా 64,000 పడకలతో సుమారు 4000 కొవిడ్ రక్షిత కోచ్‌లను సిద్ధం చేసిందని దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం 169 కోచ్‌లను పలు రాష్ట్రాలకు అందజేసినట్లు వెల్లడించారు. కొవిడ్ రక్షిత కోచ్ కేటాయించాలని నాగపూర్ మున్సిపల్ కమిషనర్ కోరగా, 11 కోచ్‌లను అందజేసేందుకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు తెలిపారు. ప్రతి కోచ్‌లో 16 మంది రోగులు […]
దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ నివారణకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలు వినియోగించుకోవడానికి అనుగుణంగా 64,000 పడకలతో సుమారు 4000 కొవిడ్ రక్షిత కోచ్‌లను సిద్ధం చేసిందని దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం 169 కోచ్‌లను పలు రాష్ట్రాలకు అందజేసినట్లు వెల్లడించారు. కొవిడ్ రక్షిత కోచ్ కేటాయించాలని నాగపూర్ మున్సిపల్ కమిషనర్ కోరగా, 11 కోచ్‌లను అందజేసేందుకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు తెలిపారు.
ప్రతి కోచ్‌లో 16 మంది రోగులు ఉండేలా ఆధునీకరించిన స్లీపర్లు ఉంటాయని, మౌలిక సదుపాయాతో సహా కావాల్సిన వైద్య పరికరాలను రాష్ట్ర ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేస్తాయని పేర్కొన్నారు. ఎమ్‌ఓయూ ప్రకారం కోచ్‌లో శానిటేషన్, క్యాటరింగ్ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వివరించారు. మహారాష్ట్రలోని అజినీ ఐసీడీ ఏరియాలో కూడా ఐసోలేషన్ కోచ్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని 9 ఇతర ప్రధాన స్టేషన్ల వద్ద కోచ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నందూర్‌బార్ (మహారాష్ట్ర) వద్ద ఈ సౌకర్యాన్ని ప్రస్తుతం 57 మంది ఉపయోగించుకుంటున్నారని, 322 పడలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. ఢిల్లీలో 1200 పడక సామర్థ్యం గల 75 కొవిడ్ రక్షిత కోచులను అందజేశామని వివరించారు. షాకూర్‌బస్తీలో 50 కోచ్‌లు, ఆనంద్ విహార్ స్టేషన్‌లో 25 కోచ్‌లు, మధ్య ప్రదేశ్‌లో గల పశ్చిమ రైల్వేలోని రత్లాం డివిజన్‌లో 320 పడక సామర్థ్యంగల 20 కోచ్‌లను ఇండోర్ సమీపంలోని తిహి స్టేషన్‌లో ఏర్పాటు చేశామని వెల్లడించారు. యూపీ నుంచి ఎలాంటి అభ్యర్థన రాలేదని, ఫైజాబాద్, బోదోని, వారణాసి, బరేలి, నజీబాబాద్ వద్ద 800 పడక సామర్థ్యంతో (50 కోచ్) ప్రతి ప్రాంతంలో 10 కోచ్‌ల చొప్పున ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు వివరించారు.