చిట్టాపూర్‌లో కరోనా విజృంభణ

దిశ, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్వగ్రామమైన చిట్టాపూర్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గ్రామం నుంచి 92 మంది అనుమానితుల శాంపిళ్లను ఉస్మానియా ఆస్పత్రికి పంపగా 40 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. మరికొన్ని శాంపిళ్ల ఫలితం రావాల్సి ఉంది. కాగా, ఈ నెల 6న సోలిపేట అంత్యక్రియల్లో పాల్గొన్న వ్యక్తిగత సహాయకులు ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. మంగళవారం వారి కుటుంబ సభ్యుల్లో నలుగురికి వైరస్ సోకింది. గ్రామంలో […]

Update: 2020-08-20 05:51 GMT

దిశ, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్వగ్రామమైన చిట్టాపూర్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గ్రామం నుంచి 92 మంది అనుమానితుల శాంపిళ్లను ఉస్మానియా ఆస్పత్రికి పంపగా 40 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. మరికొన్ని శాంపిళ్ల ఫలితం రావాల్సి ఉంది. కాగా, ఈ నెల 6న సోలిపేట అంత్యక్రియల్లో పాల్గొన్న వ్యక్తిగత సహాయకులు ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. మంగళవారం వారి కుటుంబ సభ్యుల్లో నలుగురికి వైరస్ సోకింది.

గ్రామంలో 16 మంది కరోనా బారినపడినట్లు మంత్రి హరీశ్ రావు దృష్టికి వచ్చింది. దీంతో ఆయన సంచార ఆర్టీపీసీఆర్ పరీక్షల వాహనాన్ని చిట్టాపూర్‌కు పంపారు. సోమవారం సేకరించిన శాంపిళ్లలో కొన్నింటి ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. మరోవైపు రామలింగారెడ్డి బంధువు ఒకరికి తాజాగా పాజిటివ్‌గా తేలింది. రామలింగారెడ్డి అంత్యక్రియలకు సుమారు 3 వేల మంది వచ్చారు. దీంతో నియోజకవర్గమంతా వైరస్ పాకింది. ఇప్పటికే దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్, చేగుంట, రాయపోల్, నార్సింగ్ మండలాల్లో 150 మందిపైగా వైరస్ బారిన పడ్డారు.

Tags:    

Similar News