మరి కొద్దిరోజుల్లో థర్డ్ వేవ్ .. ఎయిమ్స్ చీఫ్ సంచలన ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా థర్డ్ వేవ్ అనివార్యమని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందో కూడా ఆయన తేల్చిచెప్పేశారు. మరో 6 నుంచి 8 వారాల్లో థర్డ్ వేవ్ దేశంలో వస్తుందని అంచనా వేశారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ప్రజలు కరోనా నిబంధనలు పాటించట్లేదని, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నుంచి ప్రజలు ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని గులేరియా […]

Update: 2021-06-19 04:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా థర్డ్ వేవ్ అనివార్యమని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందో కూడా ఆయన తేల్చిచెప్పేశారు. మరో 6 నుంచి 8 వారాల్లో థర్డ్ వేవ్ దేశంలో వస్తుందని అంచనా వేశారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ప్రజలు కరోనా నిబంధనలు పాటించట్లేదని, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నుంచి ప్రజలు ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని గులేరియా స్పష్టం చేశారు.

ప్రజలు మాస్కులు ధరించడం లేదని, భౌతికదూరం పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడో వేవ్ వస్తే మూడు నెలల పాటు ఉండే అవకాశముందని గులేరియా అంచనా వేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని, వ్యాక్సిన్ ఎక్కువమంది వేయించుకుంటే థర్డ్ వేవ్ ముప్పు తగ్గుతుందన్నారు.

Tags:    

Similar News