ఉమ్మడి నల్లగొండలో కరోనా విజృంభణ
దిశ, వెబ్డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 346 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో నల్లగొండ జిల్లాలో 157, సూర్యాపేట జిల్లాలో 116, యాదాద్రి భువనగిరి జిల్లాలో 73 కేసులు నిర్ధారణ అయినట్టు ఆయా జిల్లాల వైద్యాధికారులు తెలిపారు. దీంతో పాజిటివ్ వచ్చిన వారితో ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారో […]
దిశ, వెబ్డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 346 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో నల్లగొండ జిల్లాలో 157, సూర్యాపేట జిల్లాలో 116, యాదాద్రి భువనగిరి జిల్లాలో 73 కేసులు నిర్ధారణ అయినట్టు ఆయా జిల్లాల వైద్యాధికారులు తెలిపారు. దీంతో పాజిటివ్ వచ్చిన వారితో ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారో వివరాలు తెలుసుకొని, వారి నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.