మంచిర్యాల జిల్లాలో ఒకే రోజు 33 కేసులు

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సింగరేణి కార్మిక క్షేత్రంపై కరోనా పంజా విసిరింది. ఆదివారం ఒక్కరోజునే 33 మంది ఈ మహమ్మారి వైరస్ బారినపడడంతో నల్ల నేల ఉలిక్కిపడింది. తాజా కేసులతో మంచిర్యాల జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 118కి చేరింది. మొన్నటిదాక బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్​, జన్నారం ప్రాంతాల్లో మాత్రమే ప్రభావం చూపిన వైరస్​ ఇప్పుడు జిల్లా కేంద్రానికి పాకింది. చాపకింద నీరులా అంతటా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు పాజిటివ్​ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. […]

Update: 2020-06-29 03:34 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సింగరేణి కార్మిక క్షేత్రంపై కరోనా పంజా విసిరింది. ఆదివారం ఒక్కరోజునే 33 మంది ఈ మహమ్మారి వైరస్ బారినపడడంతో నల్ల నేల ఉలిక్కిపడింది. తాజా కేసులతో మంచిర్యాల జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 118కి చేరింది. మొన్నటిదాక బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్​, జన్నారం ప్రాంతాల్లో మాత్రమే ప్రభావం చూపిన వైరస్​ ఇప్పుడు జిల్లా కేంద్రానికి పాకింది. చాపకింద నీరులా అంతటా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు పాజిటివ్​ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పట్టణంలోని ప్రముఖ టెక్స్​టైల్​ వ్యాపారి కుటుంబంలో ఇద్దరితో పాటు వారి డ్రైవర్​కు శనివారం పాజిటివ్​ గా నిర్ధారణ అయ్యింది. ఇద్దరు హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో టెస్టులు చేయించుకుని, అక్కడే చికిత్స పొందుతుండగా, మరొకరిని బెల్లంపల్లిలోని ఐసోలేషన్​ సెంటర్​కు తరలించారు. జిల్లా నుంచి నాలుగు రోజుల క్రితం పంపిన 28 శాంపిల్స్​ టెస్టు రిపోర్టులు శనివారం రాగా, ఇందులో 14 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ పాజిటివ్ కేసుల కాంటాక్టులు, కుటుంబ సభ్యులకు సంబంధించి సుమారు వందకు పైగా కేసుల శాంపిళ్ల పరీక్షల్లో 33 మందికి పాజిటివ్ రావడం కలకలం రేపుతున్నది. కాగా తాజా కేసుల్లో ఎక్కువగా బెల్లంపల్లి ప్రాంతానికి చెందిన వారు ఉండడంతో ఆందోళన చెందుతున్నా రు.

Tags:    

Similar News