విజయా డైరీకి.. పశు సంవర్ధక శాఖ భూమి

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఆధునిక టెక్నాలజీతో రూ.250 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే మెగా డైరీ నుంచి మరిన్ని విజయ ఉత్పత్తులు ప్రారంభించాలని పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మసబ్ ట్యాంక్‌లోని మంత్రి కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో మెగా డైరీ నిర్మాణం కోసం పశుసంవర్ధక శాఖకు చెందిన 32 ఎకరాల భూమిని విజయ డైరీకి 99 ఏండ్లు లీజుకు ఇస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి […]

Update: 2020-07-30 07:49 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఆధునిక టెక్నాలజీతో రూ.250 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే మెగా డైరీ నుంచి మరిన్ని విజయ ఉత్పత్తులు ప్రారంభించాలని పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మసబ్ ట్యాంక్‌లోని మంత్రి కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో మెగా డైరీ నిర్మాణం కోసం పశుసంవర్ధక శాఖకు చెందిన 32 ఎకరాల భూమిని విజయ డైరీకి 99 ఏండ్లు లీజుకు ఇస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర సమక్షంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, డైరీ ఎండి శ్రీనివాస్ రావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేయనున్న త్వరలో మెగాడైరీ నమూనా సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.

Tags:    

Similar News