కుక్కల దాడిలో 30మందికి గాయాలు
దిశ, వరంగల్ తూర్పు: వరంగల్ నగరంలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. వీటి బారిన పడి ఒకే రోజు 30మంది ఎంజీఎంలో చేరారు. నగరంలోని గిర్మాజీపేట, జాన్‌పాక, పాపయ్యపేట చమన్, శివనగర్, ఖిలా వరంగల్ తదితర ప్రాంతాలకు చెందిన వారిపై శుక్రవారం కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. రాత్రి వేళల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ కనబడిన వారిపై దాడి చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు […]
దిశ, వరంగల్ తూర్పు: వరంగల్ నగరంలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. వీటి బారిన పడి ఒకే రోజు 30మంది ఎంజీఎంలో చేరారు. నగరంలోని గిర్మాజీపేట, జాన్‌పాక, పాపయ్యపేట చమన్, శివనగర్, ఖిలా వరంగల్ తదితర ప్రాంతాలకు చెందిన వారిపై శుక్రవారం కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. రాత్రి వేళల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ కనబడిన వారిపై దాడి చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయమై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలను పడుతున్నట్లు అధికారులు లెక్కల్లో చూపుతున్నా ఒక ప్రాంతంలో పట్టిన వాటిని మరో ప్రాంతంలో వదులుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వాటి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కుక్కలను నిర్మూలించాలని స్థానికులు కోరుతున్నారు.