సాయ్ కేంద్రాల్లో 30 మందికి కరోనా

దిశ, స్పోర్ట్స్ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో నడిచే నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో శిక్షణ పొందుతున్న అథ్లెట్లు, సహాయక సిబ్బందికి కరోనా సోకినట్లు తెలిసింది. పటియాలా, బెంగుళూరులో ఉన్న రెండు సెంటర్లలో 741 ప్రికాషన్ టెస్టులు నిర్వహించారురు. ఇందులో 30 మందికి కోవిడ్ 19 నిర్దారణ అయినట్లు సాయ్ అధికారులు బుధవారం వెల్లడించారు. కాగా, ఈ అథ్లెట్లలో ఎవరూ టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన వాళ్లు లేరని సాయ్ స్పష్టం చేసింది. […]

Update: 2021-03-31 10:32 GMT

దిశ, స్పోర్ట్స్ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో నడిచే నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో శిక్షణ పొందుతున్న అథ్లెట్లు, సహాయక సిబ్బందికి కరోనా సోకినట్లు తెలిసింది. పటియాలా, బెంగుళూరులో ఉన్న రెండు సెంటర్లలో 741 ప్రికాషన్ టెస్టులు నిర్వహించారురు. ఇందులో 30 మందికి కోవిడ్ 19 నిర్దారణ అయినట్లు సాయ్ అధికారులు బుధవారం వెల్లడించారు. కాగా, ఈ అథ్లెట్లలో ఎవరూ టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన వాళ్లు లేరని సాయ్ స్పష్టం చేసింది.

భారత పురుషుల బాక్సింగ్ ప్రధాన కోచ్ సీఏ కట్టప్ప, షార్ట్ పుట్ కోచ్ మొహిందర్ సింగ్ థిల్లాన్‌లకు పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. పటియాలాలో 313 టెస్టులు నిర్వహించగా 26 మందికి, బెంగళూరులో 428 టెస్టులు నిర్వహించగా నలుగురికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. పటియాలాలో పాజిటివ్ వచ్చిన వారిలో 16 మంది క్రీడాకారులు కాగా, వీరిలో 10 మంది బాక్సర్లు, ఆరుగురు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఉన్నారు. కాగా కోవిడ్ కేసులు నమోదైనా సాయ్ సెంటర్లలో ట్రైనింగ్ ఆపడం లేదని అధికారులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారందరినీ ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News