దిమ్మతిరిగిందిగా.. 30 మంది మందుబాబులకు ఊహించని షాక్..
దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగుండం మండల పరిధిలోని గోదావరిఖనిలో మద్యం తాగి పట్టుబడిన వారికి పోలీసులు దిమ్మతిరిగేలా చేశారు. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో గత కొంతకాలంగా నిర్వహించిన డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడిన మందుబాబులకు తొలుత కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే అనార్థాల గురించి అర్థమయ్యేలా వివరించారు. మీ కుటుంబం కోసమైన మద్యం తాగి వాహనాలను నడుపవొద్దని సూచించారు. ఆ తర్వాత డ్రంక్ & డ్రైవ్‌లో […]
దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగుండం మండల పరిధిలోని గోదావరిఖనిలో మద్యం తాగి పట్టుబడిన వారికి పోలీసులు దిమ్మతిరిగేలా చేశారు. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో గత కొంతకాలంగా నిర్వహించిన డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడిన మందుబాబులకు తొలుత కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే అనార్థాల గురించి అర్థమయ్యేలా వివరించారు. మీ కుటుంబం కోసమైన మద్యం తాగి వాహనాలను నడుపవొద్దని సూచించారు.
ఆ తర్వాత డ్రంక్ & డ్రైవ్‌లో దొరికిన వారికి అధిక మొత్తంలో జరిమానాలు విధించడమే కాకుండా, జైలు శిక్ష కూడా పడుతుందని.. వారి లైసెన్సుల రద్దు కోసం సంబంధిత అధికారులకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. కౌన్సిలింగ్ అనంతరం 30 మంది మందు బాబులను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోదావరిఖని పర్వతపు రవి ముందు హాజరుపరచగా వారికి రూ. 2000 చొప్పున ఒక్కొక్కరికి మొత్తం 60,000 వేల జరిమానా విధించారు. భవిష్యత్‌లో మరల మద్యం సేవించి వాహనం నడిపితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ సత్యనారాయణ, బుర్ర శ్రీనివాస్, లవణ్‌లు పాల్గొన్నారు.