పెళ్లికి ముందే శృంగారం చేస్తే తప్పేంటి? : హాట్ బ్యూటీ
దిశ, సినిమా: టాలీవుడ్ భామలు పాయల్ రాజ్‌పుత్, ఈషా రెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘3 రోజెస్’. ఈ ట్రైలర్‌ను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేయగా.. ఈ నెల 12 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. విభిన్న మనస్తత్వాలు కలిగిన ముగ్గురు అమ్మాయిల కథాంశంతో తెరకెక్కిన సిరీస్‌కు మాగీ దర్శకత్వం వహించాడు. కాగా 30 ఏళ్లు వయసు దాటిన పెళ్లికాని అమ్మాయి పాత్రలో […]
దిశ, సినిమా: టాలీవుడ్ భామలు పాయల్ రాజ్‌పుత్, ఈషా రెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘3 రోజెస్’. ఈ ట్రైలర్‌ను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేయగా.. ఈ నెల 12 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. విభిన్న మనస్తత్వాలు కలిగిన ముగ్గురు అమ్మాయిల కథాంశంతో తెరకెక్కిన సిరీస్‌కు మాగీ దర్శకత్వం వహించాడు. కాగా 30 ఏళ్లు వయసు దాటిన పెళ్లికాని అమ్మాయి పాత్రలో పూర్ణ.. అందమైన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుని ఆరాటపడే యువతిగా ఈషా.. ట్రెక్కింగ్‌పై ఆసక్తి కనబరిచే అమ్మాయిగా పాయల్ రాజ్‌పుత్ కనిపించనున్నారు.
ట్రైలర్ విషయానికొస్తే ముగ్గురు అమ్మాయిలు కలిసి ఓ బార్‌లో పార్టీ చేసుకుంటూ.. ‘ఫక్ ది సొసైటీ, ఫక్ ది రూల్స్, ఫక్ ది మ్యారేజ్’ అని చెప్పే డైలాగులు మహిళా స్వేచ్ఛను ప్రతిబింబిస్తున్నాయి. ఇదే క్రమంలో ‘పెళ్లి తర్వాత కూడా ఇదే కదా చేసేది. పెళ్లికి ముందే చేస్తే తప్పేంటి’ అని బాయ్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
క్రికెటర్ స్మృతి మంధనా పెళ్లాడుతానన్న స్టార్ హీరో ఇతడే
https://twitter.com/Rakulpreet/status/1458671347974823936?s=20