విమాన ప్రమాదంలో 13మంది మృతి.. 15మందికి సీరియస్!

దిశ, వెబ్‌డెస్క్: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ ఏయిర్‌పోర్టులో జరిగిన ఏయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. మొదట పైలట్ మృతిచెందగా, తాజాగా కో-పైలట్‌తో పాటు మరో 11 మంది ప్రయాణికులు మృతిచెందారు. మొత్తంగా 15 మందికి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 123 మంది ప్రయాణికులు గాయాల పాలై చికిత్స పొందుతున్నారు. వందేభారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి ప్రయాణికులతో వస్తున్న విమానం కోజికోడ్ ఏయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో రన్ […]

Update: 2020-08-07 11:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ ఏయిర్‌పోర్టులో జరిగిన ఏయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. మొదట పైలట్ మృతిచెందగా, తాజాగా కో-పైలట్‌తో పాటు మరో 11 మంది ప్రయాణికులు మృతిచెందారు. మొత్తంగా 15 మందికి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 123 మంది ప్రయాణికులు గాయాల పాలై చికిత్స పొందుతున్నారు.

వందేభారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి ప్రయాణికులతో వస్తున్న విమానం కోజికోడ్ ఏయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో రన్ వే పై జారింది. ఆ సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులతో పాటు 10మంది చిన్నారులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా విమాన ప్రమాదంపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. అక్కడ కుండ పోత వర్షం కురుస్తుండటంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్రయాణికుల బంధువులు తమ వారిని సంప్రదించేందుకు హెల్ప్‌లైన్ నెంబర్ 0495-2376901 ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Tags:    

Similar News