ఏపీకి ముగ్గురు.. తెలంగాణకు ఒకరు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు నలుగురు న్యాయమూర్తులను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఒకరిని తెలంగాణకు కేటాయించగా, ముగ్గురిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. బొప్పూడి కృష్ణమోహన్, కె.లలితకుమారి, కె.సురేశ్ రెడ్డిలను ఏపీకి నియమించగా, బి.విజయసేన్‌రెడ్డిని తెలంగాణకు నియమించింది. నూతనంగా నియమితులైన న్యాయమూర్తులకు సంబంధించిన వివరాలను పరిశీలించినట్టయితే.. బొప్పూడి కృష్ణమోహన్ స్వస్థలం గుంటూరు. ఈయన కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిగా 10 ఏళ్లపాటు పనిచేశారు. 2019 నుంచి ఏపీ హైకోర్టులో కేంద్రం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్‌గా […]
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు నలుగురు న్యాయమూర్తులను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఒకరిని తెలంగాణకు కేటాయించగా, ముగ్గురిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. బొప్పూడి కృష్ణమోహన్, కె.లలితకుమారి, కె.సురేశ్ రెడ్డిలను ఏపీకి నియమించగా, బి.విజయసేన్‌రెడ్డిని తెలంగాణకు నియమించింది. నూతనంగా నియమితులైన న్యాయమూర్తులకు సంబంధించిన వివరాలను పరిశీలించినట్టయితే.. బొప్పూడి కృష్ణమోహన్ స్వస్థలం గుంటూరు. ఈయన కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిగా 10 ఏళ్లపాటు పనిచేశారు. 2019 నుంచి ఏపీ హైకోర్టులో కేంద్రం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. లలిత కుమారి ప్రస్తుతం తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయ స్టాండింగ్ కౌన్సెల్‌గా కొనసాగుతున్నారు. అలాగే, అనంతరపురం జిల్లా శింగనమల మండలానికి చెందిన సురేశ్ రెడ్డి.. 1989లో న్యాయవాదిగా తన విధులను ప్రారంభించారు. హైకోర్టులో క్రిమినల్, సివిల్, రాజ్యాంగానికి సంబంధించిన కేసుల్లో నిపుణులు. ఇక బి.విజయ్‌సేన్ రెడ్డి హైదరాబాద్‌కు చెందినవారే. ఈయన తండ్రి ప్రముఖ జస్టిస్ బి. సుభాషణ్ రెడ్డి.
Tags: AP High Court, TS High Court, Supreme Court