కిరాతకం.. ముగ్గురు సోదరుల కళ్లు పీకేసి!

దిశ, వెబ్‌డెస్క్ : అడవిలో బెర్రీ పండ్ల కోసం సరదాగా వెళ్లిన ముగ్గురు సోదరులు తిరిగిరాలేదు. కంగారు పడిన కుటుంబ సభ్యులు గ్రామస్తుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా, ఆ ముగ్గురూ విగత జీవులుగా కనిపించారు. ఇక్కడే ఒళ్లు గగుర్పొడిచే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ముగ్గురు సోదరుల కళ్లు పీకేసి వారిని చెరువులో పడవేశారని తేలింది. వారంతా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన బాలురు కాగా, అందరూ ఆయా కుటుంబాల్లో మొదటి సంతానమే కావడం గమనార్హం. […]

Update: 2020-12-03 06:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అడవిలో బెర్రీ పండ్ల కోసం సరదాగా వెళ్లిన ముగ్గురు సోదరులు తిరిగిరాలేదు. కంగారు పడిన కుటుంబ సభ్యులు గ్రామస్తుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా, ఆ ముగ్గురూ విగత జీవులుగా కనిపించారు. ఇక్కడే ఒళ్లు గగుర్పొడిచే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ముగ్గురు సోదరుల కళ్లు పీకేసి వారిని చెరువులో పడవేశారని తేలింది. వారంతా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన బాలురు కాగా, అందరూ ఆయా కుటుంబాల్లో మొదటి సంతానమే కావడం గమనార్హం. ప్రస్తుతం దీనిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ జిల్లా బామి గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. బామి గ్రామానికి చెందిన సుదాన్షు తివారీ (14), శివం తివారీ(14), హరిఓం తివారీ (14) ముగ్గురూ అన్నదమ్ముల పిల్లలు. వీరంతా 8వ తరగతి చదువుతున్నారు. మంగళవారం ముగ్గురు కలిసి బెర్రీల కోసం సమీపంలోని అడవికి వెళ్లారు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. వారి ఆచూకీ ఎంతకూ లభించలేదు. మరునాడు బుధవారం ఉదయం స్థానికులు వెతుకుతుండగా చెరువు సమీపంలో వారి దుస్తులు కనిపించాయి. వెంటనే నీటిలోకి దిగి సెర్చ్ చేయగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. బాడీలను వెలికి తీసిన అనంతరం ఆ ముగ్గురి అబ్బాయిల కళ్లు పీకేసినట్లు ఉన్న రక్తపు చారలను గ్రామస్తులు గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. తమ అబ్బాయిలను కావాలనే దారుణంగా హత్యచేసి చెరువులో పడవేశారని, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వల్లే ఇలా చేశారని బాధితులు ఆరోపించారు.

అయితే, బామి గ్రామానికి చెందిన రాజేష్ కుమార్‌కు సుధాన్షు మొదటి సంతానం. మృతునికి ఒక తమ్ముడు, సోదరి ఉన్నారు. అదే విధంగా రాకేశ్ కుమార్ కొడుకు శివం కూడా పెద్దవాడు.అతనికి సోదరుడు మరియు సోదరి ఉన్నారు. చివరగా మున్నాలాల్ తివారీ తనయుడు హరిఓం కూడా మొదటి సంతానమే. కాగా, రాకేశ్ కుమార్ తివారీ, మున్నాలాల్ తివారీ సొంత అన్నదమ్ములు. రాజేష్ తివారీ మాత్రం కజిన్. నవంబర్ 30వ తేదీన రాజేష్ తివారీ సోదరి వివాహం సందర్భంగా ఈ కుటుంబం గ్రామంలో సమావేశమైంది. డిసెంబర్ 1వ తేదీన వీరంతా కలిసి దగ్గరిలోని అటవీ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలోనే ముగ్గురు బాలురు బెర్రీల కోసం అడవులోనికి వెళ్లి విగత జీవులుగా మారారు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాలను వెంట బెట్టుకుని, తమకు సరైన న్యాయం చేయాలని లెహంగ్‌పూర్ మార్కెట్ సమీపంలోని స్థానిక రహదారిని దిగ్భందించారు.

విషయం తెలుసుకున్న మిర్జాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అయితే, కుటుంబ సభ్యులు ఆరోపించిన విధంగా ఇది హత్యకాదని, సరదాగా చెరువులో దిగి మునిగిపోయి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కళ్లు పీకేసినట్లు చేస్తున్న వాదనలు అవాస్తవమని, మృతదేహాల ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని కొట్టిపారేశారు. ప్రస్తుతం ముగ్గురు వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం జరుగుతోందని, ఆ తర్వాతే అసలు విషయం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా, మృతుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముగ్గురు సోదరులను కళ్లు పీకేసి దారుణంగా హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు యూపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News