ఏ ఒక్కరికీ ఆకలి బాధ ఉండొద్దు
దిశ, మెదక్: రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ఆకలి బాధ ఉండకూదనే ఉద్దేశంతో బియ్యం పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఒక్కొకరికి 12కిలోల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2కోట్ల 80 లక్షల మందికి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. బియ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి లబ్దిదారునికి అందజేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల రేషన్ షాపుల్లో 3 .34 లక్షల […]
దిశ, మెదక్: రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ఆకలి బాధ ఉండకూదనే ఉద్దేశంతో బియ్యం పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఒక్కొకరికి 12కిలోల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2కోట్ల 80 లక్షల మందికి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. బియ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి లబ్దిదారునికి అందజేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల రేషన్ షాపుల్లో 3 .34 లక్షల మెట్రిక్ టన్నుల అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. ఉదయం, సాయంత్రం అనే కాకుండా స్థానిక అవసరాలను బట్టి రేషన్‌షాపుల సమయాన్ని పొడిగిస్తామని తెలిపారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ కరోనా నివారణకు కృషి చేయాలని కోరారు.
Tags: medak,civi supply chairmen,rice distribution,3.34metric ton rice,available