రెండేళ్ల బాలుడి అపహరణ
దిశ, కామారెడ్డి: సంచార జాతుల కుటుంబానికి చెందిన రెండేళ్ల బాబును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు.ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని వార్ధా జిల్లా ఆర్వీ గ్రామానికి చెందిన సంజీవ్ సింగ్, పూజ కుటుంబ సభ్యులు గత 20 రోజుల నుంచి జంగంపల్లి శివారులో జాతీయ రహదారి పక్కన ఆయుర్వేద మందులు విక్రయిస్తున్నారు. రోజుమాదిరిగానే మందులు విక్రయం తర్వాత గురువారం రాత్రి అందరూ పడుకున్నారు. తెల్లవారి లేచి […]
దిశ, కామారెడ్డి: సంచార జాతుల కుటుంబానికి చెందిన రెండేళ్ల బాబును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు.ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని వార్ధా జిల్లా ఆర్వీ గ్రామానికి చెందిన సంజీవ్ సింగ్, పూజ కుటుంబ సభ్యులు గత 20 రోజుల నుంచి జంగంపల్లి శివారులో జాతీయ రహదారి పక్కన ఆయుర్వేద మందులు విక్రయిస్తున్నారు. రోజుమాదిరిగానే మందులు విక్రయం తర్వాత గురువారం రాత్రి అందరూ పడుకున్నారు.
తెల్లవారి లేచి చూసేసరికి సంతోష్, పూజల రెండేళ్ల బాబు మోహిత్ కనిపించలేదు. చుట్టుపక్కల అంతా వెతికినా కనిపించకపోయే సరికి పోలీసులను ఆశ్రయించారు. గత 20 రోజులుగా ఇక్కడే మందులు అమ్ముకుంటున్నామని, బాధితుడు సంజీవ్ సింగ్ తెలిపారు. తమ రెండునెలల బాబును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని బోరున విలపించారు. ఎలాగైనా తమ బాబును పట్టుకుని అప్పగించాలని వేడుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బాధితులు ఉంటున్న ప్రదేశాన్ని కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ, కామారెడ్డి రూరల్, భిక్కనూర్ సీఐలు చంద్రశేఖర్ రెడ్డి, యాలాద్రి, భిక్కనూర్ ఎస్సై నవీన్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ.. బాబు ఆచూకీని కనుక్కునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పిల్లలు లేని వారు, పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మేవారు ఇలాంటి ఘటనలకు పాల్పడతారని ఆయన వెల్లడించారు. సాధ్యమైనంత త్వరలో బాబును పట్టుకుంటామని డీఎస్పీ చెప్పారు.