నేటి నుంచి రెండో టెస్టు
దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య ప్రారంభమైన ‘రైజ్ ద బ్యాట్’ సిరీస్‌లో రెండో టెస్టు ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా గురువారం నుంచి జరగనుంది. తొలి టెస్టులో 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విండీస్ జట్టు, రెండో టెస్టులో కూడా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నది. తొలి టెస్టులో ఆడని రెగ్యులర్ కెప్టెన్ జో రూట్ రెండో టెస్టు ఆడనున్నట్లు ఈసీబీ ప్రకటించింది. మ్యాచ్‌కు ముందు ఆయనకు […]
దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య ప్రారంభమైన ‘రైజ్ ద బ్యాట్’ సిరీస్‌లో రెండో టెస్టు ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా గురువారం నుంచి జరగనుంది. తొలి టెస్టులో 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విండీస్ జట్టు, రెండో టెస్టులో కూడా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నది. తొలి టెస్టులో ఆడని రెగ్యులర్ కెప్టెన్ జో రూట్ రెండో టెస్టు ఆడనున్నట్లు ఈసీబీ ప్రకటించింది. మ్యాచ్‌కు ముందు ఆయనకు కరోనా టెస్టులు నిర్వహిస్తామని చెప్పింది. తొలి టెస్టులో జో రూట్ లేని లోటు ఇంగ్లండ్ జట్టులో కనిపించింది. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆతిథ్య ఇంగ్లండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. రూట్ జట్టుతో కలువనున్న నేపథ్యంలో ఇంగ్లండ్ బలం రెట్టింపు కానుంది. కెప్టెన్, బ్యాట్స్‌మన్‌గా రూట్ తన మార్క్ చూపెట్టనున్నాడు. ఇక తుది జట్టులో బట్లర్‌కు అవకాశం ఉంటుందని కోచ్ క్రిస్ తెలిపారు. అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చి పరిశీలిస్తామన్నారు. స్టువర్ట్ బ్రాడ్ తుది జట్టులో ఉంటాడో లేదో మాత్రం తెలియరాలేదు. విండీస్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నది.