అన్నవరంలో 29 మంది సిబ్బందికి కరోనా..

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతోంది. రోజుకూ వేల సంఖ్యలోనే కేసులు నిర్దారణ అవుతున్నాయి. ప్రభుత్వం కూడా కరోనా కట్టడికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం అనుకున్న రీతిలో రావడం లేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం ఆలయ సిబ్బందికి కరోనా సోకింది. దాదాపు 300మంది సిబ్బందికి పరీక్షలు చేయగా 29 మందికి పాజిటివ్ తేలింది. దీంతో ఈనెల 14వరకు దర్శనాలు నిలిపివేసినట్లు ఆలయ EO ప్రకటించారు. కాగా, స్వామివారికి నిత్య […]

Update: 2020-08-08 08:14 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతోంది. రోజుకూ వేల సంఖ్యలోనే కేసులు నిర్దారణ అవుతున్నాయి. ప్రభుత్వం కూడా కరోనా కట్టడికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం అనుకున్న రీతిలో రావడం లేదు.

తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం ఆలయ సిబ్బందికి కరోనా సోకింది. దాదాపు 300మంది సిబ్బందికి పరీక్షలు చేయగా 29 మందికి పాజిటివ్ తేలింది. దీంతో ఈనెల 14వరకు దర్శనాలు నిలిపివేసినట్లు ఆలయ EO ప్రకటించారు. కాగా, స్వామివారికి నిత్య పూజలు, ఆర్జిత సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు.

Tags:    

Similar News